CM Chandrababu National Level Workshop on Seafood Exports : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఏయూలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సీఎం మొక్కలు నాటారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై ఏయూ నుంచి నోవాటెల్ వరకూ సీఎం చంద్రబాబు ప్రయాణించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నోవాటెల్ హోటల్లో విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీ ఫుడ్ ఎగుమతుల పై జరిగే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కి సీఎం హాజరయ్యారు. వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వీఈఆర్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. వర్క్‌షాపు అనంతరం అమరావతికి సీఎం చంద్రబాబు బయల్దేరనున్నారు. ప్రస్తుతం ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
